Thu Mar 19 2026 12:55:33 GMT+0530 (India Standard Time)
రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించండి : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో రేపు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు

ఆంధ్రప్రదేశ్ లో రేపు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రేపు కూడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఆయన అధికారులతో జరిగిన సమీక్షలో తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు వరదల్లో తొమ్మిది మంది చనిపోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు.
ఎల్లుండి తగ్గే అవకాశం...
ఇప్పటికే చాలా వరకు వర్షాలు తగ్గాయని, కానీ వరద ముప్పు పొంచి ఉందని చెప్పారు. ఎల్లుండి లోగా వర్షాలు తగ్గుతాయని ఆయన తెలిపారు. కృష్ణా గుంటూరు జిల్లాలో అసాధారణ వర్షపాతం నమోదు అయిందని 37 సెం.మీవరకు వర్షం కురిసింది అని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Next Story

